వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ పోటీ, కాంగ్రెసు మద్దతు

By Pratap
|
Google Oneindia TeluguNews

Dimple Yadav
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కన్నౌజ్ లోకసభ స్థానం నుంచి ఆమె సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఆమెపై తమ అభ్యర్థిని పోటీకి దింపబోమని కాంగ్రెసు పార్టీ ప్రకటించింది. దీంతో కాంగ్రెసు, సమాజ్‌వాదీ పార్టీల మధ్య బంధం పెరుగుతుందని భావిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అఖిలేష్ యాదవ్ రాజీనామా చేయడంతో కన్నౌజ్ లోకసభ స్థానం ఖాళీ అయింది. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానానికి బిజెపి ఇప్పటి వరకు తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. మంగళవారం అభ్యర్థిని ఖరారు చేస్తామని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పేయి చెప్పారు. జూన్ 24వ తేదీన కన్నౌజ్ స్థానానికి పోలింగు జరుగుతుంది.

ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షురాలు రీటా బహుగుణ చెప్పారు. కాంగ్రెసు పార్టీ 2009 ఎన్నికల్లో కన్నౌజులో పోటీ చేయలేదని, ఇప్పుడు కూడా పోటీ చేయకూడదని నిర్ణయించుకుందని జోషీ చెప్పారు. కన్నౌజు సీటు యాదవ్ బహుకు చాలా సురక్షితమైందని భావిస్తున్నారు.

కన్నౌజు నుంచి అఖిలేష్ యాదవ్ మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. పైగా మార్చిలో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఘన విజయం సాధించింది. డింపుల్ కన్నౌజులో బహిరంగ సభలో మాట్లాడుతారని చెబుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఈ బహిరంగ సభలో పాల్గొనే అవకాశాలున్నాయి. రాజకీయ ప్రవేశానికి డింపుల్ ప్రయత్నించడం ఇది రెండో సారి. 2009లో ఆమె ఫిరోజాబాద్‌లో పోటీ చేసి కాంగ్రెసు నాయకుడు రాజ్ బబ్బర్ చేతిలో ఓడిపోయారు.

English summary

 In yet another example of growing bonhomie between the two parties, the Congress has decided not to field any candidate against chief minister Akhilesh Yadav’s wife Dimple Yadav, the Samajwadi Party candidate in the Kannauj Lok Sabha byelection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X