విదేశాల్లోనే..: చెన్నమనేనిపై స్పీకర్‌కు పొన్నం ఫిర్యాదు

ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం లేదని, అతనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పొన్నం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జర్మనీలో ఉంటూ చెన్నమనేని రమేష్ ప్రోటోకాల్ పైన మాట్లాడటం సరికాదని అన్నారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే హాజరు పది శాతం కూడా లేదని పొన్నం అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధికి చెన్నం రమేష్ సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని తాను స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కాగా ప్రజాప్రతినిధులు ప్రజలకు నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. చెన్నమనేని రమేష్ పైన పొన్నం ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు.
కాగా చెన్నమనేని రమేష్ 2009 సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2010లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. టిడిపికి కూడా రాజీనామా చేశాడు. ఉప ఎన్నికలలో తెరాస తరఫున పోటీ చేసి గెలుపొందాడు.












Click it and Unblock the Notifications