భార్యను, బేబీని వదిలేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అరెస్టు

వెంకటేశ్వర రెడ్డికి, అర్చనా రెడ్డికి 2007లో వివాహమైంది. ఆ తర్వాత అమెరికాలోని న్యూజెర్సీకి వెళ్లారు. అమెరికాలో మాంద్యం చోటు చేసుకున్నందున స్వదేశానికి వెంకటేశ్వర రెడ్డి 2008లో భార్యను, నెలల పాపను ఇండియాకు పంపించేశాడు. తాను తిరిగి వచ్చిన తర్వాత అత్తామామలు తనను వేధించారని అర్చనా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
డబ్బుల కోసం అత్తామామలు తనను వేధిస్తుండడంతో తాను ఉద్యోగం చేయాల్సి వచ్చిందని, అయినా తన పట్ల దురుసుగా వ్యవహిరిస్తున్నారని ఆమె పోలీసులకు చెప్పింది. వాటిని భరించలేక ఆమె 2009 సెప్టెంబర్ 28వ తేదీన అర్చనా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత అర్చనా రెడ్డి అత్తింటివారికి దూరమై తల్లిదండ్రులతో ఉంటూ వస్తోంది.
వెంకటేశ్వర రెడ్డి కోసం పోలీసులు 2009లో లుకవుట్ నోటీసు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ విమానాశ్రయంలో దిగగానే విమానాశ్రయం పోలీసులు వెంకటేశ్వర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications