హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్కడ జగన్‌‍ను ఢీకొంటాం!: నాలుగింటిపై కాంగ్రెస్‌లో ఆశ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana - Kiran Kumar Reddy
హైదరాబాద్: ఉప ఎన్నికలు జరుగుతున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలో కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలలో నాలుగింటి పైన కాంగ్రెసు గట్టి ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పదిహేను అంతకు మించి సీట్లు సాధిస్తుందని, తెలుగుదేశం పార్టీ రెండు నుండి నాలుగు స్థానాలు గెలుచుకుంటుందని అందరూ భావిస్తున్నారు. కాంగ్రెసుకు మాత్రం గట్టి ఎదురు దెబ్బ తగలనుందని భావిస్తున్నారు.

అయితే కాంగ్రెసు పార్టీ ముఖ్య నేతలు మాత్రం ఈ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా నాలుగు స్థానాలు గెలుచుకుంటామని గట్టి విశ్వాసంతో ఉన్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంత్రులు, ఇతర ముఖ్య నేతలతో ఉప ఎన్నికల అంశంపై సమావేశమయ్యారు. కిరణ్, బొత్సలు వేరు వేరుగా పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇరువురు నేతలు వేర్వేరుగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది.

ఈ సమావేశాలలో మెజార్టీ నేతలు కనీసం నాలుగు స్థానాలలో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన తిరుపతి స్థానంతో పాటు ఆళ్లగడ్డ, రామచంద్రాపురం, నర్సాపురంలలో గెలుస్తామని వారు భావించినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి ఇమేజ్‌తో పాటు స్థానిక అంశాలతో తిరుపతి, ఆళ్లగడ్డలలో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారట.

ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోసు పైన ఉన్న వ్యతిరేకత రామచంద్రాపురంలో గట్టెక్కిస్తుందని, నర్సాపురంలో అన్నదమ్ములు పోటీ పడుతున్న దృష్ట్యా ప్రజలు ధర్మాన రాందాసు వైపే మొగ్గు చూపుతారని భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారట. ఉప ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనే చర్చ ఇటీవల కాలంలో జోరుగా జరిగిన విషయం తెలిసిందే.

English summary
Chief Minister Kiran Kumar Reddy and PCC president Botsa Satyanarayana on Monday met ministers and other senior Congress leaders in charge of the bypolls constituencies to take stock of the party's chances in the bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X