జగన్ సొంత జిల్లాలో సిబిఐ జెడికి అభిమాన సంఘం

CBI JD Laxmi Narayana
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసు తదితర కేసులను దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణకు అభిమాన సంఘం వెలిసింది. నిజాయితీగల అధికారికీ ఓ అభిమాన సంఘం ఉంటుందని యువత నిరూపించింది. సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ పైన అభిమానంతో మరోచోట ఓ ఫ్లెక్సీ వెలిసింది.

వైయస్ జగన్ సొంత జిల్లా కడప జిల్లాలోని దువ్వూరులో సోమవారం జెడి లక్ష్మీ నారాయణకు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిపై లక్ష్మీ నారాయణ బొమ్మతో పాటు జాతీయస్థాయిలో అవినీతిపై పోరు చేస్తున్న ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారే ఫోటోను వేశారు. 'సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ టీమ్‌కు మద్దతు పలుకుదాం. యువతీ, యువకులారా! మేథావులారా! నిజాయితీ పరులను ప్రోత్సహిద్దాం. దేశాన్ని రక్షిద్దా'మంటూ ఇట్లు దువ్వూరు యువతీ, యువకులు అని ఆ ఫ్లెక్సీ పైన రాశారు.

అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న జెడి లక్ష్మీ నారాయణ.. ప్రలోభాలకు లొంగని నైజం.. నిజాయితీ గురించి వినడమే తప్ప చూడటం అలవాటులేని మన రాష్ట్ర ప్రజలకు నిలువెత్తు నిదర్శనం.. అక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నం అంటూ ఫ్లెక్సీలో కితాబు ఇచ్చారు. కాగా అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ప్రజా చైతన్య వేదిక యువజన సంఘం ఇలాంటి ఫ్లెక్సీలు దాదాపు ఇరవై వరకు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

లక్ష్మీ నారాయణ బృందం సభ్యులను ఈ దశాబ్దపు నిజమైన హీరోలుగా అభివర్ణించింది. వీరికి మద్దతు పలుకుదాం! నిజాయితీపరులను ప్రోత్సహిద్దాం! దేశాన్ని రక్షిద్దాం! అంటూ యువతకు, మేధావులకు పిలుపునిచ్చింది! అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌లో సిబిఐ టీమ్‌కు మద్దతుగా దీనిని ఏర్పాటు చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న నాయకులను చెరసాలలో పెడుతున్న లక్ష్మీ నారాయణకు యువత సంపూర్ణ మద్దతివ్వాలని ఆయన అందులో కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+