తమిళనాడు రాజధాని చెన్నైలో క్రికెటర్ ఆత్మహత్య

ధర్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. అతని హఠాన్మరణం అందరినీ దిగ్బ్ఱాంతికి గురి చేసింది. మరణానికి ఒక రోజు ముందు ధర్మ విజయ్ సిసిపై చిదంబరం స్టేడియంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గ్లోబ్ ట్రోటర్స్ తరఫున మ్యాచ్ ఆడాడు.
ధర్మ సిటి కళాశాలలో బిఇ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. శనివారంనాడు మూడు రోజుల తమిళనాడు క్రికెటర్స్ అసోసియేషన్ ఫస్ట్ డివిజన్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు అతను బాగానే ఉన్నాడని చెబుతున్నారు. ధర్మ 2011లో తన కెరీర్‌ను ప్రారంభించాడు. పి. బాలాజీ గాయపడడంతో పరిమిత ఓవర్ల మ్యాచులో కూడా అతను అడుగు పెట్టాడు.
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టిఎన్‌సిఎ) క్లబ్ కార్యదర్శి కాశీ విశ్వనాథన్ ధర్మ మృతికి సంతాపం ప్రకటించారు. ధర్మ మృతితో తమిళనాడు క్రికెటర్లలో తీవ్ర విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications