బాబు కంటే గొప్పా! బెదిరిస్తున్నావా: జగన్‌పై తులసిరెడ్డి

తనకు కారు ఇవ్వాలంటూ దీక్ష చేస్తారట అని ఎద్దేవా చేశారు. జగన్ అనుంగు సోదరుడు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీనియర్ ఐఏస్ అధికారి బిపి ఆచార్య కూడా అదే వాహనంలోనే కోర్టుకు వెళ్లారని అన్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కూడా బాబ్లీ విషయంలో మహారాష్ట్ర పోలీసులు ఇలాంటి వాహనంలోనే తరలించారన్నారు.
వారందరి కంటే జగన్ ఏమైనా గొప్ప వ్యక్తా అని ప్రశ్నించారు. తనను వ్యాన్‌లో న్యాయస్థానానికి తీసుకు వెళ్లారంటూ జగన్ చేసిన హైడ్రామా శోచనీయమన్నారు. తన ఆత్మగౌరవనాన్ని, ఆత్మాభిమానాన్ని దిగమింగుకొని ఆ వ్యాన్‌లో ప్రయాణించానని జగన్ చెబుతున్నారని, అంటే ఆ వాహనంలో ప్రయాణించిన ఇతరులకు ఆత్మగౌరవం లేదనేది ఆయన ఉద్దేశ్యమా అన్నారు. జగన్‌కు జడ్ ప్లస్ భద్రతను ఎందుకు కల్పించాలని మండిపడ్డారు.
ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెసుకు ఆశాజనకంగా ఉంటాయని, ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే ఓటు వేశారని అనుకుంటున్నట్లు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. ఫలితాలకు అంతా బాధ్యత వహిస్తామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని చూసో, జైల్లో ఉన్న జగన్‌ను చూసో ఓట్లేయాలని వైయస్సార్ కాంగ్రెసు సెంటిమెంటుతో ప్రచారం చేసిందని, గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేదని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు.












Click it and Unblock the Notifications