'రాష్ట్రపతి': సోనియా ఆశలపై మమత నీళ్లు, కలాంవైపు..

తాము రాష్ట్రపతి అభ్యర్థులుగా ముగ్గురు పేర్లను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. తమ తొలి ప్రాధాన్యత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, రెండో ప్రాధాన్యతగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మూడో ప్రధాన్యతగా కమ్యూనిస్టు నేత సోమనాథ్ ఛటర్జీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా చెప్పారు. కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ అన్సారీ పేర్లను తమకు సూచించిందని చెప్పారు. అయితే తాము మాత్రం వారి కంటే వీరి వైపు మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు.
కాంగ్రెసు మొదటి ప్రాధాన్యత ప్రణబ్‌కు ఇస్తోందన్నారు. కానీ తమకు అది అంగీకారం కాదని చెప్పారు. రాజ్యాంగం గురించి బాగా తెలిసిన వారు రాష్ట్రపతిగా ఉండాలని వారు అన్నారు. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎవరు బాగా పని చేస్తారో వారికే పట్టం కట్టాలన్నారు. తాము ప్రతిపాదించిన ముగ్గురులో ఒకరైతే బాగుంటుందన్నారు. రాష్ట్రపతిగా అత్యంత గౌరవనీయుడైన వ్యక్తి ఉండాలన్నారు.
తాను పశ్చిమ బెంగాల్‌కు నిధుల కోసమే యుపిఏను చిక్కుల్లో పెడుతున్నట్లు వచ్చిన వార్తలను మమతా బెనర్జీ కొట్టి పారేశారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వ ప్రతిపాదనకు, నిధులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నిధులు కేటాయించమనే తన డిమాండ్ ఒక్కసారిగా హఠాత్తుగా నెరవేరేది కాదని, అందుకే రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి సంబంధం లేదన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం అవసరమన్నారు.
కాగా కాంగ్రెసు పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ లేదా అహ్మద్ అన్సారీల పేర్లను ప్రధానంగా పరిశీలిస్తోంది. ఇలాంటి సమయంలో వారి పేర్లను పక్కకు పెట్టడం ద్వారా మమత, ములాయం కాంగ్రెసు ఆశలపై నీళ్లు చల్లారు. మిత్రపక్షాల అండతోనే కాంగ్రెసు రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోల్గుతుంది. అంతేకాకుండా మిత్రపక్షంలో ఎస్పీ, తృణమూల్‌ది కీలక పాత్ర. దీంతో కాంగ్రెసు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.












Click it and Unblock the Notifications