జగన్ స్థాయికి తగ్గ భద్రత: వ్యాన్‌లో తరలింపుపై కోర్టు

జైలులో ఉన్న జగన్‌కు పటిష్ట భద్రత కల్పించాలని కోర్టు జైళ్ల శాఖను ఆదేశించింది. కోర్టుకు తరలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జగన్ స్థాయికి తగ్గట్టు బందోబస్తు ఉండాలని సూచించింది. పోలీసులతో జైళ్ళ శాఖ సమన్వయం చేసుకోవాలని తెలిపింది. కాగా ఈ నెల పదకొండవ తేదిన జగన్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలు నుండి నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు సాధారణ వ్యాన్‌లో తరలించారు. చంచల్‌గూడ జైలు నుండి తనను సాధారణ బస్సులో తరలించడంపై జగన్ కోర్టులో అసహనం వ్యక్తం చేశారు.
తనను సాధారణ బస్సులో తరలించారని, ఇది తనకు తీవ్ర అవమానమని జగన్ కోర్టులో అన్నారు. పోలీసుల ఓవరాక్షన్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఇలాగే జరిగితే తాను జైలులోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని చెప్పారు. తాను పార్లమెంటు సభ్యుడిని అని, తనకు జెడ్ కేటగిరి భద్రత ఉందని ఆయన కోర్టులో మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా ఓ పార్టీకి అధ్యక్షుడిని అని చెప్పారు. అలాంటి తనను మళ్లీ తిరిగి అదే వ్యానులో జైలుకు పంపితే వెళ్లేది లేదని చెప్పారు.
తన నేరం రుజువు కాలేదని తాను నేరస్థుడిని కాదని కేవలం నిందితుడిని మాత్రమే అని చెప్పారు. అలాంటి తనను సాధారణ బస్సులో తరలించడమేమిటన్నారు. జగన్ రాతపూర్వకంగా కోర్టుకు ఫిర్యాదు చేశారు. జగన్ ఫిర్యాదు పరిశీలించిన కోర్టు తిరిగి కట్టుదిట్టమైన భద్రతతో వేరే వాహనంలో తరలించాలని పోలీసులను ఆదేశించింది.
దీంతో జగన్‌ను చంచల్‌గూడ జైలుకు తీసుకు వెళ్లేందుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. సాధారణ వాహనంలో తరలింపుపై 14వ తేది లోపు వివరణ ఇవ్వాలని జైళ్ళ శాఖను కోర్టు ఆదేశించింది. జైలు అధికారులు దీనిపై నివేదిక ఇచ్చారు. నివేదిక అనంతరం కోర్టు ఈ రోజు దానిపై ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications