కోర్టుకు ఐఎఎస్ అధికారి ఎల్వీ: బెయిల్ మంజూరు

ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఎమ్మార్‌కు భూముల కేటాయింపుల్లో ఎల్వీ సుబ్రహ్మణ్యం అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐ అభియోగం మోపింది. ప్రస్తుతం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇవో)గా ఉన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో మరో ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు మాత్రం అనుమతించలేదు.
దాంతో ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఐపియస్ నిబంధనల మేరకు విచారించడానికి సిబిఐ కోర్టును కోరింది. కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. తాను ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే వ్యవహరించానని, వ్యవహారాన్ని సిబిఐ తప్పుగా అర్థం చేసుకుందని అంటూ తనను కేసు నుంచి మినహాయించాలని కోరుతూ ఇంతకు ముందు సుబ్రహ్మణ్యం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యను అరెస్టు చేసిన సిబిఐ ఎల్వీ సుబ్రహ్మణ్యంను మాత్రం అరెస్టు చేయలేదు. కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో మాత్రం సిబిఐ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై అభియోగాలు మోపింది. ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు ఎమ్మార్ కేసులోని ఇతర నిందితులు కొంత మంది కూడా సోమవారం కోర్టుకు హాజరయ్యారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications