గాలి జనార్దన్ రెడ్డి, అలీఖాన్ కస్టడీ పొడగింపు

విచారణ నిమిత్తం వీరిద్దరినీ తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అన్ని వివరాలు తెలిసిన అలీఖాన్‌ను హైదరాబాద్‌కు తరలించాలని కోరుతూ ఇదివరకు సిబిఐ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.
ఎమ్మార్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న స్టైలిష్ హోం మనేజింగ్ డైరెక్టర్, మార్కెటింగ్ మేనేజర్ తుమ్మల రంగారావుకి సోమవారం సిబిఐ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను విచారణ నుంచి మినహాయిస్తూ కోర్టు వెసులుబాటు కల్పించింది. తనను క్షమించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ అభ్యర్థన మేరకు కోర్టు రంగారావును అపరాధ సాక్షిగా పరిగణిస్తూ ఉత్తర్వులిచ్చింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే తిరిగి విచారణ ఎదుర్కొనవలసి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. మెజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన 164 వాంగ్మూలానికి కట్టుబడి ఉండాలని కోర్టు రంగారావును ఆదేశించింది.












Click it and Unblock the Notifications