జగన్ గెలుపుపై బొత్స కామెంట్, కిరణ్‌తో కలిసి నివేదిక

తాను ప్రస్తుతం ఉప ఎన్నికలపై నివేదికలు ఇవ్వడానికి ఢిల్లీ రాలేదని చెప్పారు. నివేదిక ఇవ్వడానికి ఇంకా సమయం ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఇద్దరం అధిష్టానానికి నివేదిక ఇస్తామని చెప్పారు. అధికారం కోసం కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ అడ్డదారులు తొక్కలేదని, తొక్కబోదన్నారు. తమ పార్టీకి ఓ విధానమంటూ ఉందని, దాని ప్రకారమే తాము ముందుకు వెళతామని చెప్పారు.
విధానాలు నచ్చని వారు బయటకు వెళ్లవచ్చునని చెప్పారు. పార్టీలో పరాజయానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. పెట్రో దెబ్బ, విద్యుత్ కొరత ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష అన్నట్టు తమ పార్టీ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం కేవలం కాంగ్రెసు పార్టీకే ఉందని చెప్పారు. త్వరలో నిర్ణయం వస్తుందన్నారు.
కొత్త మద్యం విధానంపై తన ముద్ర లేదని ఆయన చెప్పారు. తాము అవినీతి, అక్రమాలకు పాల్పడి అధికారంలో ఉండాలని చూడటం లేదన్నారు. నేరస్తులతో చేతులు కలపడం తమకు చేతకాదన్నారు. రాష్ట్రంలో అయినా, జాతీయస్థాయిలో అయినా ఏ పార్టీకి అయినా అప్పుడప్పుడు ఒడిదుడుకులు మామూలేనని, త్వరలో పార్టీ మరింత పటిష్టం చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications