డిజిపిగా దినేష్ రెడ్డి నియామకం చెల్లదు: క్యాట్ ఉత్తర్వు

కాగా డిజిపి దినేష్ రెడ్డి నియామకం చెల్లదని సీనియర్ ఐపిఎస్ అధికారి గౌతమ్ కుమార్ క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. డిజిపి నియామక ప్రక్రియను ప్రభుత్వం నిబంధనల ప్రకారం చేపట్టలేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దినేష్ రెడ్డి 1977 బ్యాచ్‌కు చెందిన అధికారి అని.. సీనియర్ అయిన తనను కాదని అతనిని డిజిపిగా నియమించడాన్ని గౌతం కుమార్ వ్యతిరేకించారు.
దీనిపై విచారణ జరిపిన క్యాట్ ఈ రోజు దినేష్ రెడ్డి నియామకం చెల్లదని ఆదేశించింది. క్యాట్ ఎనిమిది నెలలకు పైగా క్యాట్ విచారించింది. అయితే క్యాట్ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో సవాల్ చేసే అవకాశముంది. డిజిపి నియామకం కోసం రూపొందించిన సీనియార్టీ లిస్టులో మొదటి పేరు గౌతం కుమార్‌ది కాగా ఆ తర్వాత స్థానాల్లో హైదరాబాద్ మాజీ పోలీసు కమిషనర్ బల్వీందర్ సింగ్, కెఆర్ నందన్‌లు ఉన్నారు.
అయితే పదవీ కాలం ఎక్కువ లేకపోవడంతో డిజిపిగా బాధ్యతలు చేపట్టేందుకు నందన్ విముఖత చూపారు. కాగా 2010లో ఆగస్టు 31న రాష్ట్ర డిజిపిగా దినేష్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్ 2013 వరకు ఆయన పదవీ కాలం ఉంది.












Click it and Unblock the Notifications