అప్పుడప్పుడు లోకేష్ హెల్ప్, మంత్రుల పిల్లలు..:బాబు

మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడపాలని సూచించారు. మంత్రుల పిల్లలు లంచాలకు మరుగుతున్నారని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం కొత్త విధానం అంటూ లాటరీ పద్ధతిని తీసుకు వచ్చిందన్నారు. మద్యాన్ని వ్యాపారం దృష్టితో చూడవద్దన్నారు. కొత్త మద్యం పాలకీసి మేం వ్యతిరేకమన్నారు. ఈ పాలసీ ద్వారా వచ్చే లాభమేమీ లేదని సిండికేట్లు, బినామీలు పుట్టుకు వస్తారన్నారు.
మద్యం అమ్మకాలపై నియంత్రణ ఉండాలని చెప్పారు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత, ప్రజల్లో మార్పు రావాలన్నారు. 2008 నుంచి 65 ఉప ఎన్నికలు వచ్చాయని, వీటి ద్వారా ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రజలపై భారం తప్ప మరొకటి లేదన్నారు. రాయదుర్గం, ఒంగోలు, తిరుపతిలలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విజయం సాధించారన్నారు.
మద్యం విషయంలో ఖజానా నింపుకోవాలన్నదే ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోందన్నారు. ప్రజా ప్రయోజనాల కోణంలో పాలసీలు ప్రకటించాలన్నారు. సమాజంలో మార్పుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. మార్పును కోరుకునే వరంగల్ ఆర్ఈసి నుండి ఎంతోమంది విద్యావంతులు నక్సలైట్లుగా మారారని అన్నారు. మళ్లీ అదే పరిస్థితి వచ్చేలా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎవరికి మద్దతివ్వాలనే విషయం చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications