వైయస్ కలను జగన్ నిజం చేయాలి, మావాడే: శంకరన్న

రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెసు అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనేది వైయస్ కల అన్నారు. ఆ కలను జగన్ నిజం చేయాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా ప్రముఖులు ఎందరో రంగంలోకి దిగినా తిరుపతిలో పార్టీ అభ్యర్థి వెంకటరణను గెలిపించలేక పోయారన్నారు.
తనకు వెన్నుపోటు పొడిచారని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఉప ఎన్నికలలో ఓటమికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ బాధ్యత వహించాలన్నారు. కిరణ్ తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెసు ఘోర ఓటమిని చవి చూసిందన్నారు. పార్టీ నేతలే సహకరించలేదని వెంకటరమణ చెప్పినందున కిరణ్ బాధ్యత వహించాలన్నారు.
తనను పదవి నుండి తొలగిస్తారని కిరణ్ కుమార్ రెడ్డికి తెలిసి పోయిందని చెప్పారు. అందుకే వారం రోజుల్లో పైళ్లు క్లియర్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తున్నారని అన్నారు. ఇప్పటికిప్పుడు హడావుడిగా ఫైళ్లు క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం ఆయన ఇంటికెళుతున్నారనేందుకు నిదర్శమన్నారు.












Click it and Unblock the Notifications