కృష్ణా పరివాహక నాలుగు జిల్లాల్లో భూ ప్రకంపనలు

గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, మాచవరం, పిడుగురాళ్ల, అచ్చంపేట, అమరావతి, క్రోసూరు పెదకూరపాడు తదితర ప్రాంతాలలో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. కృష్ణా జిల్లాలోని నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, కంచికర్ల, పెనుగంచిప్రోలు, ఖమ్మం జిల్లాలోని మధిర, ఎర్రపాలెం, వైరా బోనకల్, నల్గొండ జిల్లాలోని కోదాడ, మేళ్లచెరువు, హుజుర్ నగర్‌లలో భూమి కంపించింది. అరగంట సమయంలో వివిధ ప్రాంతాలలో కొన్ని సెకన్ల పాటు కంపించింది.
ఇళ్లలోని సామానులు కింద పడుతుండటం, భూమి ఏదో కదులుతున్నట్లుగా అనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తదితర ప్రాంత వాసులు తమ ప్రాతంలో మొదటిసారి భూమి కంపించడం ఆశ్చర్యానికి గురి చేసిందని అంటున్నారు. తాము భయానికి గురై ఇళ్లలో నుండి బయటకు వీధులలోకి పరుగులు తీసినట్లు చెబుతున్నారు.
ఈ స్వల్ప భూకంపంతో ఆయా జిల్లాల్లో ఎలాంటి ప్రాణ నష్టం, ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా ఇటీవల గతంలోనూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో స్వల్పంగా భూమి కంపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications