సిబిఐ కోర్టు జడ్జిల బదలీలు: బాంబ్ బ్లాస్ట్ కోర్టుకు శర్మ

Hyderabad
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఎమ్మార్, కర్నాటక మాజీ మంత్రి ఓఎంసి కేసులను దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ కోర్టులో జడ్జిలను బదలీ చేశారు. మంగళవారం సాయంత్రం జడ్జిలను బదలీ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సిబిఐ జడ్జి నాగమారుతి శర్మను కమిటీ బాంబుబ్లాస్ట్ కోర్టుకు బదలీ చేసింది.

నాగమారుతి శర్మ స్థానంలో ఎంవి రమేష్‌ను జడ్జిగా నియమించింది. సిబిఐ ప్రన్సిపల్ కోర్టు జడ్జి పుల్లయ్యను సిబిఐ రెండో కోర్టుకు బదలీ చేసింది. ప్రిన్సిపల్ జడ్జిగా దుర్గా ప్రసాద్‌ను నియమించింది. గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ ఫర్ స్కామ్ ఛార్జీషీటులో శర్మ పేరు ప్రస్తావన రావడంతో ఆయనను బదలీ చేశారని తెలుస్తోంది. బెయిల్ ఫర్ స్కామ్ కేసులో అరెస్టైన పట్టాభిరామా రావు స్థానంలో పుల్లయ్య నియామకమయ్యారు.

మరోవైపు అరెస్టైన పట్టాభిరామా రావును అరెస్టు చేసిన ఎసిబి ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపర్చింది. న్యాయస్థానం పట్టాభిని 14 రోజుల జ్యూడిషియల్ రిమాండుకు తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని పట్టాభి పిటిషన్ దాఖలు చేశారు. దీనికి న్యాయస్థానం అంగీకరించింది.

కాగా కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో మెయిన్ వికెట్‌ను అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారులు మంగళవారం ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గాలికి బెయిల్ ఇచ్చేందుకు కోట్లాది రూపాయల ముడుపులు తీసుకున్నట్లు పట్టాభి రామారావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడు. మంగళవారం ఉదయం ఎసిబి అధికారులు ఆయన ఇంటి వద్ద అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+