వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ షప్తో గాయని గజాలా, తండ్రి కాల్చివేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pakistan: Famous Pashto singer, father shot dead
ఇస్లామాబాద్: ప్రముఖ పాకిస్తాన్ పాష్తో గాయని గజాలా జావెద్‌ను, ఆమె తండ్రిని మంగళవారం హత్య చేశారు. ఉత్తర పాకిస్తాన్‌లోని పెషావర్‌లో దుండగులు ఆమెను, ఆమె తండ్రిని దారుణంగా కాల్చి చంపారు. ఈ విషయాన్ని స్థానిక పాకిస్తాన్ పోలీసులు తెలిపారు. దుండకులు ఆమె పైన, ఆమె తండ్రి పైన పలుమార్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఆమె దగ్బారీ బజార్‌లోని ఓ బ్యూటీ పార్లర్ నుండి బయటకు వచ్చినప్పుడు దుండగులు కాల్చారు.

కాల్పులు జరిపిన అనంతరం దుండగులు మోటారు బైక్ పైన పారిపోయారు. ఘటనా స్థలంలో ఉన్న గాయని గజాలా సోదరి తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. పష్తో గాయనిగా ప్రజల్లో మంచి పేరు సొంతం చేసుకున్న గజాలా జావేద్‌ను పాకిస్థాన్‌లోని పెషావర్ పట్టణంలో కొందరు ఆగంతుకులు కాల్చి చంపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఈ ఘటనలో ఆమెతోపాటు తండ్రి మొహమ్మద్ జావేద్ కూడా ప్రాణాలు కోల్పోయారు. సంగీతానికి కులం, మతం, జాతి ఇలాంటి భేద భావాలేమీ ఉండవు. ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది ఉగ్రవాదులను తప్ప. దీనికి నిదర్శనమే తాలిబన్లు. సంగీతం ఇస్లాంకు వ్యతిరేకమని ప్రకటించిన తాలిబన్లు కొద్ది సంవత్సరాలుగా ఖైబర్-ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్ ప్రాంతంలో సంగీత కళాకారులు లక్ష్యంగా హత్యలకు తెగబడుతున్నారు.

వీరి చేతిలో ఇప్పటికే పలువురు కళాకారులు ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది బతుకు జీవుడా అంటూ వలసపోయారు. అయితే జావేద్ హత్యకు భర్తతో ఉన్న విభేదాలు కూడా కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అభిప్రాయభేదాల కారణంగా గత ఏడాది భర్త నుంచి వేరుపడిన గజాలా తండ్రితో కలిసి ఉంటున్నారు.

English summary
Famous Pashto singer Ghazala Javed and her father were shot dead by unidentified assailants in Peshawar, Northwest Pakistan, said police today.
 According to the relatives of the deceased singer, the unidentified men shot several times at her father and the singer, while she was leaving a beauty parlour in Dab
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X