కల్యాణ్, శింగనమల రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

వారు తమకు ముందస్తు బెయిల్ కావాలని నాంపల్లి నాలుగో మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఫిర్యాదులను పరిశీలించి ప్రాథమిక ఆధారాలు లభించాకే కేసు నమోదు చేశామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి బెయిల్ ఇవ్వొద్దని సిఐడి తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు.
తెలుగు సినీ నిర్మాతలు సింగనమల రమేష్, సి. కళ్యాణ్‌లపై, ఆంజనేయులు గుప్తాపై సిఐడి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.భాను కిరణ్‌తో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లకు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల మీద వారిపై సిఐడి కేసులు నమోదు చేసింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సిఐడి వారిపై కేసులు నమోదు చేసింది. సి. కళ్యాణ్‌పై నిర్మాత నట్టి కుమార్ సిఐడికి ఫిర్యాదు చేశారు.
నట్టి కుమార్ ఈ వ్యవహారంలో సిఐడి ముందు కూడా హాజరయ్యారు. వీరిరువురు పరస్పరం తీవ్ర ఆరోపణలు కూడా చేసుకున్నారు. భాను కిరణ్‌తో కలిసి సి.కళ్యాణ్, సింగనమల రమేష్ పలు దందాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సూరి హత్యకు శింగనమల రమేష్ సమక్షంలోనే భాను కిరణ్ టెస్ట్ ఫైరింగ్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. కాగా ఇటీవల నట్టి కుమార్ సి కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. నిర్మాత సి. కళ్యాణ్ భానుకు బినామీయే అని నొక్కి చెప్పారు. సి. కళ్యాణ్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. వీరిద్దరు అక్రమ డాక్యుమెంట్లతో బ్యాంకులకు కోట్లకు టోకరా వేశారని నట్టి ఆరోపించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications