కోలా అరెస్టుకు విజయవాడ పోలీసుల గాలింపు

చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న కోలా కృష్ణమోహన్ ఇటీవల బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆయన ఓ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుపై ఆరోపణలు చేయగా, ఆ తర్వాత పత్రికా ప్రకటనలు ఇచ్చాడు. తనకు ప్రాణభయం ఉండడం వల్లనే బయటకు రావడం లేదని అతను చెప్పుకున్నాడు.
కోలా కృష్ణమోహన్ 2009లో జైలు నుంచి బయటకు వచ్చాడు. వేరే కేసులో అతనికి శిక్ష ఖరారైనట్లు తెలుస్తోంది. కోలాను పట్టుకోవడానికి సహకరించాలని పోలీసులు మీడియాను కోరుతున్నారు. కోలా కృష్ణమోహన్‌పై ఉన్న కేసులను డిసిపి రవీంద్రనాథ్ పరిశీలిస్తున్నారు. కోలా కృష్ణమోహన్ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబుకు విదేశీ ఖాతాలున్నాయంటూ కొన్ని నెంబర్లు చెబుతూ అవే ఖాతా నెంబర్లంటూ కోలా కృష్ణమోహన్ చెప్పాడు. కోలా కృష్ణమోహన్ ఆరోపణలపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. కోలా కృష్మమోహన్ మీడియా సమావేశానికి, పత్రికా ప్రకటనలకు సాక్షి మీడియా అధిక ప్రాధాన్యం ఇచ్చింది.












Click it and Unblock the Notifications