మమతకు షాక్: టాటాపై న్యాయపోరులో ఓటమి

నిరుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మమతా బెనర్జీ ఈ చట్టాన్ని రూపొందించారు. సింగూరులో బుద్ధదేవ్ భట్టాచార్య టాటా మోటార్స్ సంస్థకు భూమి కేటాయించడాన్ని మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. టాటా మోటార్స్ సంస్థకు వ్యతిరేకంగా ఆమె పెద్ద యెత్తున ఉద్యమం చేపట్టారు.
మమతా బెనర్జీ తెచ్చిన చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమంటూ టాటా మోటార్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, టాటా మోటార్స్ వాదనను హైకోర్టు సింగిల్ జడ్జి తోసిపుచ్చారు. సింగూరు భూ చట్టం రాజ్యాంగబద్ధమేనని తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి తీర్పును టాటా మోటార్స్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది.
తీర్పు అమలుపై రెండు నెలల పాటు హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. తన తీర్పుపై పై కోర్టుకు వెళ్లడానికి అవకాశం కల్పిస్తూ డివిజన్ బెంచ్ ఆ స్టే విధించింది. సెప్టెంబర్ 28వ తేదీ వరకు తీర్పు అమలుపై స్టే విధించింది. టాటా మోటార్స్ సంస్థకు గత ప్రభుత్వం సింగూరులో 997 ఎకరాల భూమిని కేటాయించింది. నానో కారు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఆ భూమిని కేటాయించింది. భూమిని ఇవ్వడానికి ఇష్టం లేని రైతులకు చెందిన 400 ఎకరాల భూమిని తిరిగి ఇవ్వాలని మమతా బెనర్జీ ప్రతిపక్షంలో ఉండగా డిమాండ్ చేశారు.
టాటా మోటార్స్ 2008లో నానో కారు ప్రాజెక్టును గుజరాత్‌లోని సనంద్ ప్రాంతానికి తరలించింది. అయితే, సింగూరు భూములను మాత్రం తన స్వాధీనంలోనే ఉంచుకుంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications