ఈడి విచారణ: శ్రీలక్ష్మిని 3, రాజగోపాల్‌ను ఆరుగంటలు

శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్‌లను ఆరు గంటల పాటు విచారించారు. మధ్యలో గంట సేపు వారికి లంచ్ విరామం ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డిని మౌఖికంగా ప్రశ్నించిన అధికారులు.. శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లకు ప్రశ్నల షీట్ అందించారు. వారు లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. తాను ఓఎంసి కేసులో ఎవరికీ మేళ్లు చేకూర్చలేదని శ్రీలక్ష్మి ఈడికి తెలిపినట్లుగా తెలుస్తోంది. వీరిని సోమవారం కూడా విచారించే అవకాశముందని తెలుస్తోంది.
అలాగే ఈడి అధికారులు సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, బిపి ఆచార్యలను విచారించనున్నారు. జగన్ కంపెనీలలోకి వచ్చిన పెట్టుబడులు తదితర అంశాలపై వారిని ప్రశ్నించనున్నారు. మంగళవారం ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డి, విజయ రాఘవ, బిపి ఆచార్య, కోనేరు ప్రసాద్‌లను ఈడి విచారించనుంది.
కాగా ఉదయం జగన్ అక్రమాస్తులు, ఎమ్మార్, ఓఎంసి కేసులలో రిమాండులో ఉన్న నిందితులను విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఈడి నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు అందుకు అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో ఈడి అధికారులు ఆదివారం నుండి విచారణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications