లీడర్ షిప్‌పై సెమినార్: వైయస్సార్సీలో అధ్యాపక వింగ్

ఈ విభాగం ద్వారా సమాజంలో వస్తున్న ఆర్థిక, సామాజిక మార్పులపై ఎప్పటికి అప్పుడు నివేదికలను పార్టీ ముఖ్యనేతలకు అందించనున్నట్లు అధ్యాపక విభాగం ప్రతినిధులు పార్టీ కార్యాలయంలో తెలిపారు. సుమారు మూడు వందల మంది అధ్యాపకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వారికి పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి వైయస్సార్ కాంగ్రెసులోకి ఆహ్వానించారు.
ప్రొపెసర్స్ విభాగం ఏర్పాటు చేసిన వారు లీడర్ షిప్ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ అంశంపై అధ్యాపకులు, పలువురు పార్టీ నేతలు చర్చించారు. కాగా ఇటీవల ఉప ఎన్నికలలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాలలో ఉప ఎన్నికలు జరగగా జగన్ పార్టీ పదిహేను అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోగా, ఉన్న ఒక్క పార్లమెంటు స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలలో మంచి ఉత్సాహం నింపింది. ఉప ఎన్నికల ఫలితాలు జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆనందాన్ని కలిగించాయి.












Click it and Unblock the Notifications