జెడి కాల్‌లిస్ట్: జగన్ పార్టీ నేతలపై చంద్రబాల ఫిర్యాదు!

సిబిఐ జెడికి ఆమె నుండి మూడు వందలకు పైగా ఫోన్ కాల్సు వెళ్లినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చెప్పారు. దానిపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తన కాల్ లిస్టును బయటపెట్టడాన్ని చంద్రబాల తప్పు పట్టారు. దానిపై ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశముంది. సిబిఐ జెడి కాల్ లిస్టు వివరాలను నాచారం పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ ద్వారా సాక్షి విలేకరి తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ జరిపారు. అయితే సిబిఐ జెడి కాల్ లిస్టుపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రానందున ఎలాంటి చర్యలు తీసుకోలేదని రెండు రోజుల క్రితం డిజిపి దినేష్ రెడ్డి చెప్పారు. ఫిర్యాదు అందిన తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. ఈ రోజు చంద్రబాల ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పోలీసులతోపాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారందరి పైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కాగా ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సిబిఐ జెడి కాల్ లిస్టు బయట పెట్టిన విషయం తెలిసిందే. ఆ కాల్ లిస్టులో పలువురు విలేకరుల ఫోన్ నెంబర్లతో పాటు చంద్రబాల ఫోన్ నెంబరును కూడా వారు బహిర్గతం చేశారు. జెడికి చంద్రబాల ఫోన్ చేశారని, మళ్లీ అదే చంద్రబాల ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు ఫోన్ చేశారని, దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications