బాబు ధర్నాకు దూరంగా జూ. మిత్రుడు నాని, చిన్నం

ఇటీవల వారు పార్టీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నారు. నాని, రామకోటయ్య జగన్ పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇలాంటి సమయంలోనే వారు అధినేత పాల్గొన్న మహాధర్నాలో పాల్గొనకపోవడం చర్చకు తావిస్తోంది. కొడాలి నాని ఉప ఎన్నికలకు ముందు జగన్ పార్టీ వైపు వెళతారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన మంత్రి పార్థసారథితో భేటీ కావడంతో ఆ పార్టీ వైపు చూస్తున్నారనే వాదనలు వినిపించాయి.
తాజాగా ఉప ఎన్నికల ఫలితాల అనంతరం విజయవాడలో పలు చోట్ల వైయస్ జగన్‌తో పాటు ఉన్న నాని ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. అయితే వాటిపై నాని ఇటీవల బాబును కలిసి వివరణ ఇచ్చారు. తాను జగన్ పార్టీలోకి వెళ్లడం లేదని, టిడిపిలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. వివరణ ఇచ్చిన నాలుగు రోజులకే బాబు ధర్నాలో ఆయన పాల్గొనక పోవడం గమనార్హం.
మరోవైపు చిన్నం రామకోటయ్య... ఏకంగా తాను వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చినా ఈ పార్టీ నుండి పోటీ చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తాను అప్పటి పరిస్థితులను అనుసరించి ప్రజలకు సేవ చేయడానికి అనుకూలంగా ఉంటుందని భావించే పార్టీలోకి వెళతానని చెప్పారు. అయితే ఆయన జగన్ వైపు వెళ్లేందుకే మానసికంగా సిద్ధమయ్యారని, కానీ అప్పుడే ఆ వైపు వెళుతున్నట్లు మాత్రం సంకేతాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications