దావూద్ ఇబ్రహీంతో బాలీవుడ్ నటి లైలాఖాన్‌కు లింక్స్

ఇంటెలిజన్స్ నివేదికల ప్రకారం కమల్ యద్వానీకి దావూద్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. దావూద్ సన్నిహితుడు మరియు అతని కుటుంబ సభ్యులు... లైలాఖాన్, ఆమె కుటుంబ సభ్యులు దేశం విడిచి వెళ్లేందుకు ఫేక్ పాస్‌పోర్టులు తీసుకునేందుకు సహాయపడ్డారని డిఐజి గరీబ్ దాస్ చెప్పారు. ఈ విషయం తమ ఇంటరాగేషన్‌లో ఉన్న పర్వేజ్ తక్ వెల్లడించారని ఆయన చెప్పారు.
పర్వేజ్ తక్‌ను జమ్మూ పోలీసులు అరెస్టు చేశారు. ఇతను స్థానికంగా కాంట్రాక్టర్‌గా ఉన్నాడు. ఇతనికి లైలాఖాన్ కేసుతో సంబంధం ఉంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు లైలాఖాన్‌కు సంబంధించిన ఎస్‌యువిని సీజ్ చేశారు. ఈమె తన కుటుంబ సభ్యులతో సహా గత మే 29 నుండి కనిపించడం లేదు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లైలాఖాన్, ఆమె కుటుంబ సభ్యుల కోసం వెతుకుతోంది.
అయితే ఈమెను పోలీసులు ఈ నెల 22న అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జూన్ 22 ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అయితే అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఢిల్లీ హైకోర్టు పేలుళ్లతో లైలాఖాన్‌కు లింకులు ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లైలాఖాన్ రెండు మూడు చిత్రాలలో నటిస్తోంది. ఈ సినిమాలు విడుదల కాలేదు.
కాగా ముంబయి పేలుళ్ల కేసులో కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పేలుళ్ల ఘటన సూత్రధారుల్లో ఒకడైన అబుహజమ్ అలియాస్ సయీద్ జుబియూద్దీన్‌ను ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. ఇండియన్ ముజహిద్దీన్ టెర్రరిస్టు సంస్థకు చెందిన ఇతను పాక్‌కు వెళ్లి మంబయి పేలుళ్ల కోసం పలువురికి శిక్షణ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications