హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెయిల్ పిటిషన్ కొట్టివేత:హైకోర్టులో శ్రీలక్ష్మికి చుక్కెదురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srilaxmi
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులో అరెస్టై చంచల్‌గూడ మహిళా జైలులో ఉన్న శ్రీలక్ష్మికి బుధవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో చుక్కెదురయింది. శ్రీలక్ష్మి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఓఎంసి కేసు విచారణ కొనసాగుతోందని, ఇలాంటి సమయంలో బెయిల్ రద్దు చేస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశముందని సిబిఐ వాదించింది.

శ్రీలక్ష్మి తన పాసుపోర్టు పోలీసులకు అందజేస్తారని, మంత్రుల ఆమోదంతోనే ఆమె చేశారని, సిబిఐ కావాలనే ఆమెపై ఆరోపణలు చేస్తోందని, సాక్ష్యాలు తారుమారు చేసినట్లు ఇంతకుముందు ఏమీ ఆధారాలు లేవని.. కాబట్టి ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు సిబిఐ వాదనలతో ఏకీభవించి బెయిల్ పిటిషన్‌ను కొట్టేశారు.

కాగా ఓఎంసి కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి చంచల్‌గూడ మహిళా జైలులో ఉన్నారు. గతంలో ఆమెకు సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సిబిఐ పైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు ఆమె బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో ఆమె సిబిఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు.

అనంతరం శ్రీలక్ష్మి మళ్లీ బెయిల్ కోసం తన వంతు ప్రయత్నాలు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ అక్కడ ఆమెకు బుధవారం చుక్కెదురయింది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిది అక్రమ అరెస్టు అంటూ దాఖలు చేసిన పిటిషన్ పైన వాదనలు కొనసాగుతున్నాయి.

English summary
High Court quashed Srilaxmi bail petition on Wednesday. She is in Chanchalguda women jail now. She was arrested in Karnataka former minister Gali Janardhan Reddy's OMC case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X