ఢిల్లీ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు, దర్యాప్తు

జహంగీర్ పూరి - గుర్గావ్ లైన్‌లో సికిందర్‌పూర్ మెట్రో రైల్వే స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. దీంతో బాంబు స్క్వాడ్ అధికారులతో పాటు దర్యాప్తు బృందం సభ్యులు రంగంలోకి దిగారు. బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోదాల్లో సాయం కోసం డాగ్ స్క్వాడ్‌ను కూడా రప్పించారు.
ముంబై దాడుల కేసులో పాల్గొన్నట్లు అనుమానిస్తూ టెర్రరిస్టు అబూ జుందాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ స్టేషన్‌ను పేల్చివేస్తున్నట్లు ఫోన్ వచ్చింది. జుందాల్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అంతకు ముందు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒరిస్సా, మహారాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.












Click it and Unblock the Notifications