ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరణ: టెక్కీ ఆత్మహత్య

అక్రమ సంబంధం అనుమానంతో ఓ భార్యను భర్త కొట్టి చంపిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోటకొండ గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి నాలుగేళ్ల క్రితం సోని అనే మహిళతో వివాహం అయింది. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త ఆదివారం ఉదయం రోకలిబండతో కొట్టి చంపారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. అనంతరం భర్త పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.
విశాఖపట్నం జిల్లాలో గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. కృష్ణా కాలేజీ సమీపంలోని ఎక్సైజ్ కార్యాలయం పక్కన ఖాళీ స్థలంలో పాత గోడ పక్కన క్రికెట్ ఆడుతున్న విద్యార్థులపై ఆ గోడ విరిగి పడింది. ఈ ప్రమాదంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications