ప్రత్యూష కేసు: శిక్ష తగ్గింపుపై సుప్రీంలో పిటిషన్

ప్రత్యూష మృతి కేసులో తనకు హైకోర్టు విధించిన శిక్షను తగ్గించాలని కోరుతూ సిద్ధార్థ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సిద్ధార్థ రెడ్డి పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు సిబిఐని ఆదేశించింది. గతంలో హైకోర్టు సిద్ధార్థ రెడ్డికి విధించిన ఆరేళ్ల శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పు చెప్పింది. దీంతో సిద్ధార్థ రెడ్డి ఆ తర్వాత కోర్టులో లొంగిపోయాడు.
గత 2002 సంవత్సరంలో ప్రత్యూష హత్యకు గురైన విషయం తెల్సిందే. ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ రెడ్డి శీతలపానీయంలో విషం కలిపి ఇవ్వడం వల్లే ఆమె మరణించినట్టు శవపరీక్షలో తేలింది. ఈ కేసులో సిద్ధార్థరెడ్డికి నాంపల్లి కోర్టు ఆరేళ్ళ జైలు శిక్షను విధిస్తూ గతంలో తీర్పు ఇచ్చింది. దీనిపై ముద్దాయి హైకోర్టును ఆశ్రయించాడు.
దీనిపై విచారణ జరిపిన కోర్టు కింది కోర్టు విధించిన ఆరేళ్ల శిక్షా కాలాన్ని రెండేళ్లకు కుదించింది. అలాగే, రూ.50 వేల జరిమానా విధించింది. అప్పటికే సిద్ధార్థ రెడ్డి 115 రోజులు జైలుశిక్షను అనుభివించాడు.












Click it and Unblock the Notifications