తెలంగాణ ఇస్తే నీటి యుద్ధాలు: ఎంపి రాయపాటి

కృష్ణా డెల్టాకు ఈ సీజన్‌లో బ్రిటిష్ కాలం నుంచి నీరు విడుదలవుతోందని, ఆపడానికి ఎవరికీ హక్కు లేదని ఆయన అన్నారు. కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ నుంచి నీరు విడుదల చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులతో పాటు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
కాగా, రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తే లేదని కాంగరెసు సీనియర్ నేత కెఆర్ ఆమోస్ చెప్పారు. రాయలసీమ నాయకత్వం వల్లనే మొదటి నుంచి తెలంగాణ అన్యాయానికి గురైందని ఆయన సోమవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే ఇటువంటి వాదనను తెరపైకి తెస్తున్నారని ఆయన విమర్సించారు
తెలంగాణ కాంగ్రెసు నేతలతో పాటు ఎవరు కూడా రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించరని ఆయన అన్నారు. అవసరమైతే దానికి వ్యతిరేకంగా తాము ఉద్యమానికి కూడా సిద్దమని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమకు హామీలు ఇవ్వాలని తాము కోరుతున్నట్లు, అందులో భాగంగానే రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెస్తున్నామని సీమాంధ్రకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ సోమవారం విశాఖపట్నంలో అన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications