గాలి బెయిల్ కేసు: సిబిఐకి యాదగిరిరావు టోకరా?

మాజీ న్యాయమూర్తి చలపతి రావుతో తనకు పరిచయం ఉందన్న విషయాన్ని గాలి సోమ శేఖర్‌కు చెప్పానని, తర్వాత తాము సిబిఐ జడ్జి పట్టాభి రామారావు ద్వారా బెయిల్ తెప్పించుకోవడానికి చలపతి రావును ఉపయోగించుకోవచ్చని భావించామన్నారు. ఈ క్రమంలో చలపతి, సోమ శేఖర్‌లకు సెంట్రల్ కోర్టు హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేశానని, వీరిద్దరికీ ముందే పరిచయం ఉందన్న విషయం అప్పుడే తనకు తెలిసిందన్నారు.
తనకు కమీషన్ కింద రూ. 20 లక్షలు ఇస్తారని చలపతిరావు చెప్పారని, బెంగళూరులో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును ఇప్పిస్తానని సోమ శేఖరరెడ్డి హామీ ఇచ్చారని యాదగిరి వివరించాడు. గాలికి బెయిల్ వచ్చిన రోజు దశరథ రామిరెడ్డి, సోమ శేఖరరెడ్డి, సురేష్ బాబు, తాను కలిసి అశోక్ నగర్ వెళ్లి అక్కడికి చలపతి రావును పిలిపించి ఐదారు బ్యాగుల్లో ఉన్న డబ్బు మూటలను అందజేశామన్నాడు. తర్వాత తాను అశోక్ నగర్ వచ్చి చలపతి రావుకు ఫోను చేశానన్నాడు. కొద్దిసేపటికి చలపతిరావు వచ్చి ఓ ప్లాస్టిక్ బ్యాగు తనకు ఇచ్చారని, అందులో రూ. 9.5 లక్షలే ఉన్నాయని వివరించాడు.
సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో యాదగిరి పైవిధంగా చెప్పారు. అయితే చలపతి రావు అరెస్టయిన తర్వాత ఆయనను ఎసిబి అధికారులు ప్రశ్నించినప్పుడు గాలికి బెయిల్ వచ్చిన రోజు రాత్రి 11.30కి తన ఇంటికి యాదగిరి ఒక అట్టపెట్టెను పంపాడని, ఆ పెట్టె ఒక వైపు తెరిచి ఉండటంతో వెంటనే యాదగిరికి ఫోన్ చేశానని, అందులో కొంత డబ్బు తాను వాడుకున్నట్లు యాదగిరి చెప్పాడన్నారు.
ఆ తర్వాత ఆ పెట్టెలోని డబ్బులో సగాన్ని రెండు బ్యాగుల్లో దాచానని, మొత్తం సొమ్ము రూ. 3 కోట్లు ఉంటుందని చలపతి వెల్లడించారు. తాజాగా యాదగిరి ఇంట్లో దొరికిన కోట్లాది రూపాయల నగదును గమనిస్తే మొత్తం డీల్‌ను మాట్లాడుకొని 9.5 కోట్ల సొమ్మును యాదగిరి తీసుకొని ఉంటారని అంటున్నారు. యాదగిరి ఇంట్లో రూ.3.75 కోట్లు దొరకగా, ఇంకా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినట్లుగా గుర్తించారు. అంటే మే 26న యాదగిరి రావు సిబిఐని తప్పుదోవ పట్టించినట్లుగా అర్థమవుతోంది. సోమవారం జరిపిన సోదాలలో తొలుత రూ.2.25 కోట్లు దొరికినట్లుగా తెలిసింది. ఆయితే ఆ తర్వాత అధికారులు రూ.3.75 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications