ఊపిరి సమస్యతో ఆస్పత్రిలో చేరిన శతృఘ్ను సిన్హా

Shatrughan Sinha
ముంబై: శ్వాస సంబంధమైన సమస్య తలెత్తడంతో ప్రముఖ సినీ నటుడు శతృఘ్ను సిన్హా ఆస్పత్రిలో చేరారు. ఆయన సోమవారం సాయంత్రం కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. శతృఘ్ను సిన్హా సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేరారని, శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.

శతృఘ్ను సిన్హాకు వైద్యం అందిస్తున్నామని, ఆయన పరిస్థితి మెరగవుతోందని వైద్యులు చెప్పారు. శతృఘ్ను సిన్హా ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో రోజు ఆయన ఆస్పత్రిలో ఉంటారని అంటున్నారు. ఆయన భార్య పూనమ్ సిన్హా, కుమారుడు లవ్, కుశ్ ఆస్పత్రిలో ఉన్నారు. తన తండ్రి ఆరోగ్యం గురించి కూతురు సోనాక్షి సిన్హా ట్విట్టర్‌లో రాసింది.

శతృఘ్ను సిన్హాకు 66 ఏళ్లు. ఆయన 1970 వరకు సినీ రంగంలో ఉన్నారు. శతృఘ్ను సిన్హా రాజకీయ నాయకుడు కూడా. ఆయన రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో లోకసభకు ఎన్నికయ్యారు. బీహార్‌లోని పాట్నాలో 1945లో జన్మించిన శతృఘ్ను సిన్హా తనదైన శైలిలో హిందీ చిత్రసీమలో ప్రత్యేక ముద్ర వేశారు.

కాళీచరణ్ వంటి సినిమాల్లో ఆయన నటన ప్రేక్షకులను అలరించింది. సాజన్, మేరే అప్నే, ప్రేమ్ పూజారి వంటి సినిమాల్లో ఆయన నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+