అబ్దుల్ కలాంకు మంత్రి పదవి: 98లో వాజపేయి ఆఫర్

వాజ్‌పేయి అహ్వానాన్ని అంగీకరించి ఉంటే రాష్ట్రపతిగా ఎంపిక కాక ముందు అబ్దుల్ కలాం కేంద్ర మంత్రి అయ్యేవారు. వాజ్‌పేయి కోరిక తీరి ఉంటే కలాం కేంద్ర మంత్రిగా మరో కొత్త పాత్రలో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించేవారు. అయితే, ఆయన అప్పటికే దేశ ప్రయోజనాలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉన్నందున వాజ్‌పేయి ఆహ్వానాన్ని అంగీకరించలేకపోయారు.
1998లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ ఏడాది మార్చి 15న అర్ధరాత్రి వాజ్‌పేయి నుంచి ఫోన్ వచ్చిందని, తాను కొత్త మంత్రివర్గం ఏర్పాటు కోసం జాబితా సిద్ధం చేస్తున్నానని తనను కూడా అందులో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తనకు చెప్పారని, దీంతో తాను కొంత సమయం ఇస్తే ఆలోచించుకుని చెబుతానని బదులిచ్చానని, ఆలోచించుకుని రేపు ఉదయం తొమ్మిది గంటలకు తనను కలవాల్సిందిగా వాజ్‌పేయి కోరారని, అప్పటికప్పుడు తన సన్నిహిత మిత్రులతో సంప్రదింపులు మదలు పెట్టానని, తెల్లవారుజామున మూడు గంటల వరకూ మాట్లాడుకుంటూనే ఉన్నామని, ఆ తర్వాత రోజు ఉదయం తాను ప్రధాని నివాసానికి వెళ్లి, మంత్రివర్గంలో చేరరాదన్న నిర్ణయాన్ని చెప్పానని కాలం తన పుస్తకంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం తమ బృందం దేశ ప్రయోజనాలకు సంబంధించి కీలకమైన రెండు బాధ్యతలు నెరవేర్చడంలో తలమునకలై ఉందని, ఒకటి అగ్ని క్షిపణిని అభివృద్ధి పరచడం, రెండోది అణు కార్యక్రమానికి చెందిన వరుస పరీక్షలు నిర్వహించడమని, ఈ రెండు పనులు ఎంతో కీలకమైనవని, తన పూర్తి సమయాన్ని వాటికి సంబంధించిన పనుల కోసం వెచ్చించాల్సి ఉందని, దేశం కోసం ఈ పనులు చేసేందుకు మీరు అనుమతిస్తే ముందుకు సాగుతాను అని చెప్పానని రాశారు. దీంతో మీ భావాలను తాను అభినందిస్తున్నానని, మీ లక్ష్య సాధనలో మీరు ముందుకు సాగిపోవచ్చని వాజ్‌పేయి బదులిచ్చారని కలాం పేర్కొన్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications