సృష్టికి మూలం ఈ దైవ కణాలే కావచ్చు: శాస్త్రవేత్తలు

హిగ్స్ కణాల కోసం అన్వేషణ సాగిస్తున్న రెండు బృందాల్లో ఒక బృందం అధికార ప్రతినిధి జో ఇన్‌కాండెలా జెనీవాలోని సిఇఆర్ఎన్ వద్ద మాట్లాడుతూ - ఇది ప్రాథమిక ఫలితం మాత్రమేనని, అయితే అత్యంత పటిష్టమైన, సాంద్రత కలిగిన కణాలని అన్నారు.
విశ్వం పనిచేసే విషయంపై మేధో చట్రం వివరిస్తున్న ప్రామాణిక నమూనాలతో సరిపోలినప్పుడు మాత్రమే ఈ దైవ కణాలకు విశిష్టత ఉంటుంది. దీన్ని 1970 ప్రాంతంలో రూపొందించారు. 14 ఏళ్ల క్రితం బింగ్ బాంగ్ రూపొందించిన బిగ్ బాంగ్ ప్రామాణిక నమూనా గురించి వివరిస్తుంది. కొన్ని కణాలకు ఇతర కణాలకు లేని శక్తి ఉంటుందని ఆ సిద్ధాంతం చెబుతుంది.
విశ్వసృష్టికి సంబంధించి హిగ్స్ బోసోన్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. బ్రిటిష్ పరిశోధకుడు పీటర్ హిగ్స్ పేరు మీద ఈ కణాలకు పేరు పెట్టారు. ఈ సిద్ధాంతంపై హిగ్స్ పనిచేస్తూ వచ్చారు. హిగ్స్‌బాసన్ కణాల వల్లే పరమాణువులకు ద్రవ్యరాశి ఉంటుందని, దాని వల్లే ఈ విశ్వం ఏర్పడిందని భౌతిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దైవకణం లేకపోతే అణువులు ఏర్పడం సాధ్యం కాదని, దాంతో విశ్వంలో గ్రహాల దగ్గరి నుంచి జీవం వరకు దేనికీ స్థానం ఉండేది కాదని పరిశోధకుల అంచనా. ఈ దైవకణాన్ని కనుగొనడానికి స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో 'సెర్న్' ఓ భారీ భూగర్భ పరిశోధనా కేంద్రాన్ని నిర్మించింది.
ఇందుకోసం 'లార్జ్ హాడ్రన్ కొల్లైడర్' అనే 18మైళ్ల పొడవైన సొరంగాన్ని ఏర్పాటు చేసింది. విశ్వం ఆవిర్భావానికి మూలంగా భావిస్తున్న బిగ్ బ్యాంగ్(మహా విస్ఫోటం)ను ఈ సొరంగంలో కృత్రిమంగా సృష్టించింది. రెండు ఫొటాన్ పరమాణువులను కాంతి వేగంతో ఢీకొట్టించడం వల్ల జనించే మూలకాలపై పరిశోధన జరిపింది. ఇందులో హిగ్స్ బాసన్ కణం ఉనికిని తాజాగా కనుగొన్నట్లు సమాచారం. రెండు శాస్త్రవేత్తల బృందాలు వేర్వేరుగా ఈ పరిశోధనలు జరిపాయి.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications