ఎన్ఆర్ఐ భర్త, అత్తింటి వేధింపులు: యువతి ఆత్మహత్య

ఆనంద్ ఎంబిఏ చదివి అమెరికాలో ఉంటున్నాడు. విజయలక్ష్మి వివాహం అయినప్పటి నుంచే అత్త వారింట్లో భర్త, అత్త, మామ, మరుదుల నుండి వేధింపులు వచ్చాయి. ఆనంద్ మొదట ఆస్ట్రేలియాలో ఉండగా కొన్ని నెలల పాటు భార్యను అక్కడకు తీసుకు వెళ్లి కొద్దికాలానికే హైదరాబాద్ పంపించాడు. భార్యాభర్తలిద్దరూ సుమారు ఏడాదిన్నర పాటు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇక్కడకు వచ్చిన తర్వాత అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి.
విదేశాలలో ఉన్న భర్త ఏనాడు కూడా ఫోన్‌లో మాట్లాడే వాడు కాదు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం మాని అమెరికా వెళ్లి అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల రెండు నెలల క్రితం హైదరాబాద్ వచ్చిన ఆనంద్ భార్య వద్దకు రాలేదు. అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆమె ఎక్కువగా పుట్టింట్లోనే ఉంటుండేది. గత నెల 24న భర్త అమెరికా వెళ్తుంటే విజయలక్ష్మి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లగా అక్కడ భర్త ఆమెను మాటలతో బాధపెట్టాడు.
తమ కుమారుడి పెళ్లికి రావడానికి అల్లుడు ఆనంద్‌కు రూ.లక్ష అడిగితే అత్తింటి వారు పంపించారు. అయినా అతను పెళ్లికి రాలేదు. దీంతో విజయలక్ష్మి మానసిక వేదనకు గురైంది. తల్లిదండ్రులు మంగళవారం శుభకార్యానికి వెళ్లి రాత్రి వచ్చి చూడగా తలుపులు బిగించి ఉన్నాయి. ఇంట్లో టివి పెద్దగా పెట్టి ఉంది. లోపలకు వెళ్లి చూడగా విజయలక్ష్మి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించింది. బుధవారం అత్తింటివారు రావడంతో స్థానికులు వారిపై దాడి చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామ, మరుదులపై కేసు నమోదు చేశారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications