కాఫీకోసం ప్రధానిని 10 ని. వెయిట్ చేయించిన యువతి

దారిలో అతను కాఫీ తాగాలనుకున్నారు. ఇతను శాండ్‌విచ్ బాక్స్ ప్లస్ కెఫ్‌కు వెళ్లారు. కామెరూన్ ఒక్కరే కాఫీ కోసం వచ్చారు. అతను మరెవరినీ తీసుకు రాలేదు. కామెరూన్‌ను చూసి స్థానికులు ఆశ్చర్య పోయారు. ఆయన నేరుగా కాఫీ కౌంటర్ వద్దకు వెళ్లారు. కాఫీ కౌంటర్ వద్ద షీలా థామస్ అనే యువతి ఉన్నారు. అయితే ఆమె మాత్రం కామెరూన్‌ను గుర్తించలేక పోయింది. అతను వెళ్లి ఆమెను కాఫీ అడిగారు.
కామెరూన్‌ను గుర్తించని ఆమె... తాను ఇతరులకు సర్వ్ చేయడంలో బిజీగా ఉన్నానని, కాసేపు వేచి ఉండండని చెప్పడమే కాకుండా క్యూలో రాకుండా ఇలా ఎలా వచ్చారని ప్రశ్నించారు. పది నిమిషాల తర్వాత కామెరూన్ సహాయకులు పక్కనున్న వారెన్స్ బేకరీ నుండి అతని కోసం జామ్ డోనట్, కప్ టీ తెచ్చారు. ప్రధాని దుకాణాల బయటే టీ తాగుతూ నిలబడినారు.
అటుగా వెళుతున్న పలువురు ప్రధానిని గుర్తు పట్టారు. వెంటనే అతను కాఫీ దుకాణంలోకి వచ్చి పబ్లిక్‌తో మాట్లాడారు. చాలాసేపటికి కామెరూన్‌ను గుర్తించిన వెయిట్రెస్ థామస్.. తాను పని ఒత్తిడిలో ప్రధానిని గుర్తించలేదని చెప్పింది. ప్రధానిని చూడగానే తాను గుర్తించలేక పోయానని, ఓ కస్టమర్‌కు సర్వ్ చేస్తున్నానని, అందుకు సారీ అని చెప్పారు. తనకు కొందరు ప్రధాని అని చెప్పాక గుర్తించానని చెప్పింది.












Click it and Unblock the Notifications