వైయస్ విజయమ్మపై బొత్స సత్తిబాబు ఎదురుదాడి

వైయస్ విజయమ్మ ఆరోపణలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనం కోసమే వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని వైయస్ విజయమ్మ కుటుంబం వాడుకుంటోందని ఆయన విమర్శనించారు. వైయస్ మరణం తర్వాత ఏ పథకం నిర్వీర్యమైందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేయకపోతే ప్రజలే ఆందోళనలు చేస్తారని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఉప ఎన్నికల ఫలితాలపై తనను, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నిందించిన కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్‌పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతం కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అందరూ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకే మద్దతు ఇస్తున్నారని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని రుజువు చేస్తే తల దించుకుంటానని ఆయన అన్నారు. వైయస్ మరణంపై ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద వైయస్ విజయమ్మ ఎందుకు ప్రస్తావించలేదని ఆయన అడిగారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం ఒక్కటొక్కటే తీసేస్తోందని వైయస్ విజయమ్మ తన ఢిల్లీ పర్యటనలో విమర్శించారు. తన కుమారుడు, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై దర్యాప్తు పక్షపాతవైఖరితో, కక్షపూరితంగా సాగుతోందని ఆమె ప్రధానికి ఫిర్యాదు చేశారు. ఇతర రాజకీయ పార్టీల నేతలకు కూడా సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణపై ఆమె ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications