కూపీ లాగండి!: జగన్ విచారణకు ఈడికి అనుమతి

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి)కి నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం అనుమతించింది. జగన్ కంపెనీలలోకి విదేశాల నుండి పెట్టుబడులు వచ్చాయనే ఆరోపణల నేపథ్యంలో జైలులో ఉన్న జగన్‌ను ప్రశ్నించేందుకు అనుమతించాలని ఈడి ఇటీవల నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఇరువురి వాదనలు విన్న అనంతరం కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. జగన్‌ను ప్రశ్నించేందుకు ఈడికి యస్ చెప్పింది. జగన్ తరఫు న్యాయవాదుల సమక్షంలో చంచల్‌గూడ జైలులో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించేందుకు కోర్టు ఈడికి సూచించింది. శనివారం నుండి అంటే 7వ తేది నుండి 21వ తేది వరకు విచారణకు అనుమతించింది. అక్రమాస్తుల కేసులో జగన్ విచారణకు కోర్టు ఈడికి అనుమతించడం కీలక పరిణామమే అని చెప్పవచ్చు.

కాగా జగన్‌ను ప్రశ్నించేందుకు ఈడి అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈడి పిటిషన్ పైన జగన్ ఈ నెల 2వ తేదిన కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. తాను ప్రస్తుతం జగతి పబ్లికేషన్స్‌కు డైరెక్టర్‌నో, చైర్మన్‌నో కాదని జగన్మోహన్ తన కౌంటర్‌లో పేర్కొన్నారు. డైరెక్టర్‌గా గానీ, చైర్మన్‌గా గానీ లేనని అలాంటప్పుడు తనను విచారించేందుకు ఈడి(ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్)కు అనుమతించవద్దని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈడి దాఖలు చేసిన పిటిషన్ మెయింటెనబుల్ కాదని కోర్టుకు తెలిపారు. తాను ప్రస్తుతం జైలులో ఉన్నానని తనకు కంపెనీ వ్యవహారాలు ఏమీ తెలియవని, తనకు ఫెమా, పిఎంఎల్ చట్టం వర్తించదని చెప్పారు. అయితే జగన్ కౌంటర్ పైన ఈడి తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. జగన్‌ను ప్రశ్నించినంత మాత్రాన నిందితుడు కాదని, హవాలా వచ్చిన డబ్బు వివరాలు తెలుసుకునేందుకు ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాలని ఈడి కోరింది. దీనిపై వాదనలు జూలై 2న జరిగాయి. అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+