తెలంగాణపై సీమాంధ్ర ఎంపి కావూరి మెతకబడ్డారా?

అయితే, రాష్ట్ర సమైక్యతకే కేంద్రం మొగ్గు చూపుతుందని అనుకుంటున్నట్లు కూడా ఆయన తెలిపారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ వస్తున్న కావూరి సాంబశివ రావు ఇస్తే ఇవ్వమనండి అనడం చర్చనీయాంశంగానే మారింది. ఆయన తెలంగాణపై మెతకబడి అలా అన్నారా, సమస్య రగులుతుండడంతో అసహనంతో అన్నారా అనేది తెలియడం లేదు. అయితే, అసహనం వల్లనే ఆయన అలా అని ఉంటారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
తెలంగాణను కావూరి కన్నా గట్టిగా వ్యతిరేకిస్తున్న విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ - తెలంగాణ రాదని, సమైక్యాంధ్ర నిలబడుతుందని ఈ మధ్యనే మీడియా ప్రతినిధులతో అన్నారు. కావూరి గానీ లగడపాటి గానీ తెలంగాణ వ్యతిరేకతను మానుకోవడం గానీ, సమైక్యాంధ్రకు మద్దతును తగ్గించుకోవడం గానీ చేయలేదనే మాట వినిపిస్తోంది. అయితే, తెలంగాణ సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల మాత్రం అసహనంతో ఉన్నారనే విషయం తెలుస్తూనే ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూనే సమస్యను త్వరగా పరిష్కరించాలని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెడుతున్నారు. తెలంగాణ సమస్య రగులుతుండడం వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని, దానికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడం అవసరమని వారు అంటున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై దృష్టి సారించినట్లు బలంగానే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications