రాష్ట్రపతి ఎన్నిక: కాంగ్రెసుకు వైయస్ జగన్ భయం

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి ఇంకా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భయం వీడినట్లు లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగవచ్చుననే భయాందోళనలు కాంగ్రెసు పార్టీలో నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో క్రాస్ ఓటింగ్ నివారణకు తగిన చర్యలు తీసుకునే దిశగా కాంగ్రెసు పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. ఈ నెల 19వ తేదీన రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. వైయస్ జగన్ విధేయులైన తన పార్లమెంటు సభ్యులు, శానససభ్యులు క్రాస్ ఓటింగుకు పాల్పడే ప్రమాదం ఉన్నట్లు కాంగ్రెసు నాయకత్వం అనుమానిస్తోంది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయం తీసుకుంటే క్రాస్ ఓటింగ్ ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జగన్ నిర్ణయం కోసం కాంగ్రెసు పార్టీ ఆసక్తితో ఎదురు చూస్తోంది. నిర్ణయం తీసుకునే బాధ్యతను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్‌కు అప్పగించింది.

క్రాస్ ఓటింగు భయం పట్టుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైయస్ జగన్‌కు సన్నిహితులైన పార్లెమంటు సభ్యులు, శాసనసభ్యులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్న శాసనసభ్యులు కూడా క్రాస్ ఓటింగు చేయవచ్చుననే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారంనాడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి బన్సాల్‌తో మాట్లాడారు.

పార్టీ శానససభ్యులంతా ప్రణబ్ ముఖర్జీకి ఓటేసేలా చూసేందుకు అవసమైన వ్యూహాన్ని అనుసరించడానికి కిరణ్, బొత్స ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి, ఇతర విప్‌లతో మాట్లాడారు. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి శాసనసభ్యులకు విందు ఇస్తున్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే హైదరాబాదులో అందుబాటులో ఉండాలని సిఎల్పీ ఆఫీస్ ఇంచార్జీ శ్రీకాంత్ శాసనసభ్యులందరికీ ఫోన్లు చేసి చెబుతున్నారు.

అమెరికాలో ఉన్న సమాచార, పౌరసంబంధాల మంత్రి డికె అరుణను కూడా హైదరాబాద్ పిలిపిస్తున్నారు. ఈ నెల 17వ తేదీలోగా హైదరాబాదుకు రావాలని ఆమెకు పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీన ప్రణబ్ ముఖర్జీకి తప్పకుండా వోటు వేయాలని, గైర్హాజరు కావద్దని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శానససభా పక్ష నేత హోదాలో శాసనసభ్యులందరికీ లేఖలు రాశారు.

ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెసుకు 155 మంది సభ్యులున్నారు. వీరిలో వైయస్ జగన్‌కు మద్దతుగా రంగారావు, ఆళ్ల నాని రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ పెండింగులో పట్టారు. కాగా, ఏడుగురు శాసనసభ్యులున్న మజ్లీస్ ప్రణబ్ ముఖర్జీకి ఓటేయనున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ తటస్థ వైఖరి అవలంబించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నలుగురు సభ్యులున్న సిపిఐ తటస్థ వైఖరి అవలంబిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+