జగన్ పార్టీ సిజిసిలోకి మైసూరా రెడ్డి, కొండా సురేఖ

మైసూరా రెడ్డి కూడా ఇటీవల జగన్ పార్టీలో చేరారు. ఆయన ఇటీవలి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2011లో జరిగిన ఉప ఎన్నికలలో మైసూరా రెడ్డి కడప జిల్లా టిడిపి పార్లమెంటు అభ్యర్థిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే ఆయన రాజ్యసభ పదవి ముగిసింది. మరోసారి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వకపోవడంతో మైసూరా జగన్ పార్టీలో చేరారనే ప్రచారం జరిగింది. కాగా రామచంద్రాపురం నుండి పోటీ చేసిన ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోసుకు కూడా సిజిసిలో చోటు కల్పించారు.
కాగా శాసనమండలి సభ్యుడు కొండా మురళిపై దాఖలై న అనర్హత పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును వాయిదా వేసినట్టు మండలి చైర్మన్ చక్రపాణి పేర్కొన్నారు. గురువారంతో ముగిసిన ఈ వాదనల్లో మండలి చైర్మన్ చక్రపాణి చాంబర్‌లో మురళి తరఫున న్యాయవాది పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున విప్ వై.శివరామిరెడ్డితోపాటు అడ్వకేట్లు హాజరయ్యారు. అనారోగ్యం వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ మురళి కోరారు. కేసును వాయిదా వేయకుండా ఇరుపక్షాల వాదనలు వినేందుకే శాసనమండలి చైర్మన్ ప్రాధాన్యం ఇచ్చారు.
తమ క్లయింట్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించలేదంటూ మురళి తరఫు న్యాయవాది వాదించారు. అయితే, పార్టీ కట్టుబాట్లను దాటిన మురళి, వేరే రాజకీయపార్టీ పక్షాన నిలిచారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. సాక్ష్యాలను కూడా చైర్మన్ ముందుంచారు. ఇరువురి వాదనలు విన్న చైర్మన్ చక్రపాణి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వ విప్ వై.శివరామిరెడ్డి మాట్లాడుతూ మురళి పార్టీ కట్టుబాటు, క్రమశిక్షణ ఉల్లంఘించినట్టుగా తగిన సాక్ష్యాధారాలను అందజేశామని చెప్పారు. మరో ఎ మ్మెల్సీ పుల్లా పద్మావతి క్షమాపణ కోరారని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని తెలిపారన్నారు.












Click it and Unblock the Notifications