ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించిన దానం

Danam Nagender
హైదరాబాద్: కృష్ణా డెల్టాకు నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను విడుదల చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయానికి తెలంగాణ నాయకుల నుంచి వ్యతిరేక పెరుగుతోంది. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తాజాగా హైదరాబాదుకు చెందిన మంత్రి దానం నాగేందర్ వ్యతిరేకించారు. నాగార్జన సాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉండగా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం సమంజసం కాదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. దాని వల్ల హైదరాబాద్‌లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు

కృష్ణా డెల్టాకు నీటిని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అలా ఆపకపోతే హైదరాబాదుకు అన్యాయం చేసినవారవుతారని ఆయన అన్నారు. హైదరాబాద్ నగర శివారు మున్సిపాలిటీల్లో కొన్ని చోట్ల వారం రోజులకు కూడా మచినీరు వచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదల సబబేనని నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కె. జానా రెడ్డి వంటివారు వ్యాఖ్యానించడం సరి కాదని ఆయన అన్నారు.

మెడికల్ సీట్ల విషయంలో కూడా హైదరాబాదుకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. నగరంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాదుకు అన్యాయం జరిగితే తాము ప్రేక్షక పాత్ర వహించబోమని ఆయన అన్నారు. తమ వాణిని బలంగా వినిపిస్తామని ఆయన చెప్పారు. మెడికల్ సీట్ల కేటాయింపులో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారని ఆయన అన్నారు.

కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులతో పాటు కాంగ్రెసుకు చెందిన తెలంగాణ ప్రాంత నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటి కాంగ్రెసు నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా దానం నాగేందర్ ఆ వర్గంలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+