బస్సుబోల్తా, ఒకరి మృతి: మరోచోట ఇంజనీరింగ్ విద్యార్థి

ఈ ఘటనలో అప్పల్రాజు అనే ఉద్యోగి మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ఘటన తెలుసుకున్న ఆర్టీఏ బస్సుకు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న 550 కేజిల గంజాయిని విశాఖ జిల్లా కొత్తగూడ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించి కొత్తకోటలో 250, రోలుగుంటలో 350 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీని విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని చెప్పారు.
మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హయత్‌నగర్ మండలం ఇనామ్‌గూడ దగ్గర శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications