నటి లైలా ఖాన్ హత్య కేసులో సవతి తండ్రి అరెస్టు

కుటుంబ సభ్యుల అదృశ్యం వెనక ఆసిఫ్ షేక్ పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. లైలా ఖాన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ముంబైలో నిరుడు హత్యకు గురైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అంతకు ముందు వెల్లడించారు తమ కస్టడీలోకి తీసుకున్న పర్వేజ్ తక్ విచారణలో ఆ విషయాన్ని వెల్లడించినట్లు చెబుతున్నారు.
లైలా ఖాన్ హత్యకు గురై ఉండవచ్చునని తక్ చెప్పాడు. లైలా ఖాన్, ఆమె కుటుంబ సభ్యులు చివరి సారి కిష్త్వర్‌లోని ఓ దుకాణంలో కనిపించారు. లైలా ఖాన్ కుటుంబ సభ్యులు ప్రయాణం చేసిన కారును శ్రీనగర్‌లోని సరస్సు వద్ద జమ్మూ కాశ్మీర్ పోలీసులు కనిపెట్టారు. ఆ కారు లైలా ఖాన్ తల్లి సలీనా పటేల్ పేరు మీద రిజిష్టర్ అయి ఉంది.
తక్ వెల్లడించిన సమాచారం ప్రకారం - లైలా ఖాన్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడిని పెళ్లి చేసుకుంది. అండర్ వరల్డ్‌తో సంబంధాలు బయటకు రావడంతో మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బలగాలు ఆమె కోసం, ఆమె కుటుంబ సభ్యుల కోసం వేట ప్రారంభించారు. ఓ పెళ్లి కోసమంటూ కాశ్మీర్ వెళ్లిన తన కూతురితో పాటు ఆమె తల్లి సలీనా పటేల్, ఆణె సోదరి అజ్మీనా పటేల్, ఆమె సవతి తండ్రి ఆసిఫ్ షేక్, వారి కుటుంబ మిత్రుడు పర్వేజ్ ఇక్బాల్ తక్ కనిపించకుండా పోయారని లైలా ఖాన్ తండ్రి నదీర్ షా పటేల్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
-
ఆశా భోస్లే చివరి వీడియో వైరల్.. కదిలిస్తున్న దృశ్యాలు! -
ఆశాభోస్లే - లతా మంగేష్కర్.. అక్క చెల్లెల మధ్య అసలు గొడవేంటి ??? -
ఆశా భోంస్లే 'స్వర' సామ్రాజ్యం.. ఆస్తుల గురించి షాకింగ్ నిజాలు! -
శోకసంద్రంలో చిత్రసీమ, లెజెండరీ సింగర్ కన్నుమూత! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..!












Click it and Unblock the Notifications