మాయావతికి సుప్రీంకోర్టులో ఊరట: కేసు కొట్టివేత

ఎనిమదేళ్ల క్రితం మాయావతిపై సిబిఐ కేసు నమోదు చేసింది. దీంతో అక్రమాస్తుల కేసులో తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని కోరుతూ మాయావతి 2008 మేలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనపై అక్రమాస్తుల కేసు బనాయించారని ఆమె వాదించారు.
మాయావతి అక్రమాస్తుల కేసును విచారించిన పి. సథాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ తీర్పును రిజర్వ్ చేస్తూ మే 1వ తేదీన ఆదేశాలు ఇచ్చింది. తన ఆదాయం మార్గం సక్రమేనంటూ ఆదాయం పన్ను ట్రిబ్యునల్ వెలువరించిన ఆర్డర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని, ఆ ఆర్డర్‌ను ఢిల్లీ హైకోర్టు కూడా సమర్థించిందని మాయావతి సుప్రీంకోర్టుకు తెలిపారు.
మాయావతి అక్రమంగా సంపదను పోగు చేసుకున్నారని నిరూపించడానికి తగిన ఆధారాలను సిబిఐ చూపించలేకపోయిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పార్టీ కార్యకర్తల నుంచి డబ్బును విరాళంగా పొందినట్లు మాయావతి తెలిపారు. మాయావతి ప్రకటించిన ఆస్తుల విలువ 2003లో కోటి రూపాయలు కాగా, 2007 నాటికి అది 50 కోట్ల రూపాయలకు పెరిగిందని సిబిఐ చెప్పిది.












Click it and Unblock the Notifications