వైయస్ జగన్‌కు జైలులో నోటీసులు అందించిన ఈడి?

YS Jagan
హైదరాబాద్: విచారణ నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు శనివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అందించింది. హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఈడి అధికారులు జగన్‌కు నోటీసులు ఇచ్చారు. జగన్‌ను విచారించే తేదీని ఈడి అధికారులు జైలు అధికారులకు తెలిపారు. జగన్‌ను సోమవారం నుంచి విచారించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

వైయస్ జగన్‌ను విచారించేందుకు కోర్టు ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అనుమతి ఇచ్చింది. ఈడి అధికారులు శనివారం నుంచే జగన్‌ను విచారిస్తారని భావించారు. అయితే, శనివారం చాలా సేపటి వరకు కూడా ఇందుకు సంబంధించిన సంకేతాలు ఏవీ అందలేదు. చివరికి వైయస్ జగన్‌కు ఈడి అధికారులు జగన్‌ను నోటీసులు ఇచ్చింది.

వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి)కి నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 6వ తేదీన అనుమతించింది. జగన్ కంపెనీలలోకి విదేశాల నుండి పెట్టుబడులు వచ్చాయనే ఆరోపణల నేపథ్యంలో జైలులో ఉన్న జగన్‌ను ప్రశ్నించేందుకు అనుమతించాలని ఈడి ఇటీవల నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. జగన్‌ను ప్రశ్నించేందుకు ఈడికి యస్ చెప్పింది. జగన్ తరఫు న్యాయవాదుల సమక్షంలో చంచల్‌గూడ జైలులో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించేందుకు కోర్టు ఈడికి సూచించింది.

ఈడి పిటిషన్ పైన జగన్ ఈ నెల 2వ తేదిన కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. తాను ప్రస్తుతం జగతి పబ్లికేషన్స్‌కు డైరెక్టర్‌నో, చైర్మన్‌నో కాదని జగన్మోహన్ తన కౌంటర్‌లో పేర్కొన్నారు. డైరెక్టర్‌గా గానీ, చైర్మన్‌గా గానీ లేనని అలాంటప్పుడు తనను విచారించేందుకు ఈడి(ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్)కు అనుమతించవద్దని ఆయన తన పిటిషన్‌లో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+