వైయస్‌పై శంకరన్న ప్రశంసలు, మార్పులు: అంజన్

Shankar Rao - Anjan Kumar Yadav
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలు పాలు కావడానికి కారణమైన కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు, మాజీ మంత్రి పి. శంకరరావు ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని మాత్రం ప్రశంసలతో ముంచెత్తారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టాయని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన కోరారు. కాంగ్రెసు ముఖ్యమంత్రిగానే వైయస్ మరణించారని, వైయస్ జయంతిని పార్టీపరంగానే కాకుండా అధికారికంగా కూడా నిర్వహించాలని ఆయన అన్నారు. కేసుల నుంచి బయటపడితే వైయస్ జగన్‌ను కాంగ్రెసులో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటామని ఆయన చెప్పారు.

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని కాంగ్రెసు సికింద్రాబాద్ లోకసభ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. తార్నాక డివిజన్‌లోని శాంతినగర్‌లో ఆనయ శనివారం 40 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించడానికి ఎంపి కోటా నుంచి తాను నిధులు ఇస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యురాలు జయసుధ కూడా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+