పాదరక్షలతో ఆలయంలోకి గీతారెడ్డి, తీవ్ర విమర్శలు

పాతబస్తీలోని బోనాల ఉత్సవాల్లో భాగంగా శాలిబండ హరిబౌలీ సమీపంలోని అక్కన్నమాదన్న దేవాలయానికి మంత్రి గీతారెడ్డి ఉదయం పదకొండు గంటల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వచ్చారు. పూజలు నిర్వహించేందుకు గర్భగుడిలోకి వెళ్లే ముందు పాదరక్షలను వదిలిన మంత్రి ఆ తర్వాత బయటకు వచ్చి వాటిని వేసుకుని వెళ్లిపోయేందుకు పయనమయ్యారు.
అంతలో స్థానిక మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడేందుకు ఆమె పాదరక్షలతోనే మళ్లీ అక్కడే ఉన్న మరో ప్రార్థన మందిరంలోకి వచ్చారు. అయితే ఆమె మీడియాతో మాట్లాడేందుకు ఓ ప్రార్థనా మందిరంలోకి పాదరక్షలతోనే వచ్చి, మాట్లాడి వెళ్లిపోయారు.
అయితే మంత్రి పాదరక్షలు వేసుకుని మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ప్రార్థన మందిరంలో అంతకు ముందే కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించిన పలువురు స్థానికులు మంత్రి వైఖరి పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ మాత్రం ఈ వివాదాన్ని కొట్టిపారేస్తోంది. హాల్ సమీపంలో మాత్రమే గీతారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారని, లోనికి వెళ్లలేదని కమిటీ సభ్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications