నాదెండ్ల మనోహర్‌కు చేదు అనుభవం, మహిళల నిరసన

ఎత్తిపోతల పథకాన్ని స్పీకర్ పరిశీలిస్తున్న సమయంలో స్థానిక మహిళలు తమ మంచినీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తమ నీళ్లు తమకే ఇవ్వాలని వారు నినాదాలు చేశారు. స్పీకర్ ఫ్లోరోసిస్ అవగాహనా యాత్రకు జిల్లాకు చెందిన రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి కె. జానా రెడ్డి రెండో రెండో రోజు కూడా గైర్హాజరయ్యారు.
ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోని శాసనసభ్యుల బృందం నాంపల్లి మండలంలోని ముష్టిపల్లిలో పర్యటించింది. ఫ్లోరైడ్ బాధితులను స్పీకర్, శాసనసభ్యులు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారంనాడు శాసనసభ్యుల బృందం నాగార్జునసాగర్ చేరుకుంది.
నల్లగొండ జిల్లాలోని కొన్ని గ్రామాలు తీవ్రమైన ఫ్లోరోసిస్ సమస్యతో బాధపడుతున్నాయి. అక్కడి నీళ్లకు ప్రజలు అంగవికలులు అవుతున్నారు. ఈ సమస్యను తీర్చడానికి కృష్ణా నదీ జలాలను తరలించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయినా సమస్య పూర్తిగా పరిష్కారం కావడం లేదు.












Click it and Unblock the Notifications